Chandrababu: ఏపీలో ఇక అధికారికంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణదినం

ap government good news for arya vaisya community

  • ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్య సంఘాల నేతలు

ఆర్యవైశ్యులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి ఆత్మార్పణ దినాన్ని (ప్రతి ఏటా 'మాఘ శుద్ధ విదియ' తిథి) రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 181 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులపై ఆర్య వైశ్య సంఘాలు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపాయి. 
 
ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో సచివాలయంలో సీఎంను కలిసిన ఆర్య వైశ్య సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహించాలని నాడు ఆర్య వైశ్య సంఘాలు కోరగా మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. 
 
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు ఇరుకుల రామకృష్ణ, ఆరవీటి నిర్మల, సేగు షణ్ముగం, ఎంవీబీ, గురు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News