Thummala: తొలి విడతలో మండలానికి ఓ గ్రామంలో రైతు భరోసా: మంత్రి తుమ్మల

Tummala on Rythu Bharosa

  • రైతు భరోసా నగదు జమ కొనసాగుతోందన్న మంత్రి
  • 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు వెల్లడి
  • ఈరోజు రూ.530 కోట్లు జమ చేశామన్న మంత్రి

రైతు భరోసా నగదు జమ కొనసాగుతోందని, తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్మును విడుదల చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈరోజు ఆయన రైతు భరోసా నిధుల విడుదలపై మాట్లాడారు. అర్హులందరికీ రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. మొత్తం 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు వేశామని, ఈ మొత్తం రూ.530 కోట్లు అని వెల్లడించారు. రైతు భరోసా సొమ్మును బ్యాంకులో నుంచి తీసుకోవచ్చని చెప్పారు.

Thummala
Telangana
Rythu Bharosa
Congress
  • Loading...

More Telugu News