Sankranthiki Vasthunam: షాకింగ్‌: ఓటీటీలోకి రాబోతున్న 'సంక్రాంతికి వస్తున్నాం'!

Shocking Sankranthiki Vasthunam coming to OTT

  • ఫిబ్రవరిలో ఓటీటీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' 
  • 'జీ5' సంస్థకు ఓటీటీ హక్కులు 
  • ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ను మార్చాలని 'దిల్‌'  రాజు రిక్వెస్ట్‌

వెంకటేష్  కథానాయకుడిగా రూపొందిన నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్  'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి నాయికలుగా నటించిన ఈ సినిమాను 'దిల్‌' రాజు, శిరీష్‌ నిర్మించారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఈ 13 రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసి వెంకటేష్  సినీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 

అయితే విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటికీ ఇంకా ఈ చిత్రం హౌస్‌ఫుల్‌ వసూళ్లు సాధిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుందనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థియేటర్స్‌లో విజయవంతంగా  నడుస్తున్న సమయంలోనే ఓటీటీకి రావడం పట్ల మేకర్స్‌ కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాన్ని ఫిబ్రవరి ప్రథమార్థంలో స్ట్రీమింగ్‌ చేయాల్సి వస్తుంది.

అయితే ఇంకా థియేటర్‌కు జనాలు వస్తుండటంతో ఓటీటీ విడుదల తేదీలో మార్పు చేయమని దర్శక, నిర్మాతలు ఓటీటీ సంస్థను అభ్యర్థిస్తున్నారట . ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు  జరుగుతున్నాయి. అయితే జీ5 మాత్రం అందుకు  సిద్ధంగా లేదని తెలిసింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారమే స్ట్రీమింగ్ చేస్తామని చెప్పడంతో నిర్మాత 'దిల్‌'రాజు, ఎలాగైనా ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీని మార్చాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట.

  • Loading...

More Telugu News