Pushpa: జనవరి 30న ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా

Pushpa 2 in OTT from January 30

  • నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్న పుష్ప-2 సినిమా
  • జత చేసిన సన్నివేశాలతో అందుబాటులోకి రానున్న సినిమా
  • తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న పుష్ప-2

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప2: ది రూల్' సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. గత ఏడాది డిసెంబర్ 5న ఈ సినిమా 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైంది. ఆ తర్వాత మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు.

దీంతో సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాలు అయింది. జత చేసిన సన్నివేశాలతో కూడిన సినిమానే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. పుష్ప2 సినిమా భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News