Stock Market: నష్టాలతో వారాన్ని ప్రారంభించిన స్టాక్ మార్కెట్ సూచీలు

- 824 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 263 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- భారత స్టాక్ మార్కెట్ పై అమెరికా ట్రేడ్ పాలసీ అనిశ్చితి ప్రభావం
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 824 పాయింట్లు నష్టపోయి 75,366 వద్ద ముగిసింది. నిఫ్టీ 263 పాయింట్లు నష్టపోయి 22,829 వద్ద స్థిరపడింది.
అమెరికా ట్రేడ్ పాలసీపై అనిశ్చితి కొనసాగుతుండడం... విదేశీ నిధులు తరలివెళుతుండడం... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు... భారత స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను నిర్దేశించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై తమ వాణిజ్య టారిఫ్ లను సవరిస్తుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఇవాళ్టి ట్రేడింగ్ లో ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బీఐ, మారుతి, ఎల్ అండ్ టీ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి.