Kannappa: 'క‌న్న‌ప్ప' నుంచి క్రేజీ అప్‌డేట్‌... ఫిబ్ర‌వ‌రి 3న ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్

Rebel Star Prabhas in Kannappa First Look on Feb 3rd

  • మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'
  • ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం 
  • కీలక పాత్రల్లో పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లు
  • ఈ మూవీలో ఓ ప్ర‌ధాన పాత్ర‌లో ప్రభాస్ 
  • ఆయ‌న తాలూకు ఫ‌స్ట్‌ లుక్ విడుద‌ల‌పై మేక‌ర్స్ ప్ర‌క‌ట‌న‌
  • ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట‌ర్‌ను పంచుకున్న చిత్ర బృందం

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప'. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సిద్ధమవుతున్న ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. కాగా, ఈ మూవీలో రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ కీల‌క‌ పాత్రలో క‌నిపించ‌నున్నార‌నే విష‌యం తెలిసిందే. దీంతో సినిమాలో డార్లింగ్ లుక్ ఎలా ఉండబోతుందా అని ఆయ‌న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

వారి ఎదురుచూపుల‌కు తెర దించుతూ తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫ‌స్ట్‌ లుక్ ను ఫిబ్ర‌వ‌రి 3న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఓ పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ఇందులో ప్రభాస్ కళ్లు, నుదుటి భాగం మాత్రమే కనిపిస్తోంది. నుదుటిపై విభూతి నామాలు, చేతిలో త్రిశూలంతో డార్లింగ్‌ పవర్ ఫుల్ గా కనిపించారు. అయితే, ప్రభాస్ పూర్తి లుక్ పోస్టర్ ఆ రోజు (ఫిబ్ర‌వ‌రి 3) విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. 

ఇక, ఇటీవలే కన్నప్ప నుంచి అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పోస్టర్లు విడుద‌ల చేయగా మంచి స్పంద‌న వచ్చింది. అక్షయ్, కాజల్ శివపార్వతుల పాత్రలో కనిపించనున్నారు. ఈ  భారీ బడ్జెట్ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. 'కన్నప్ప' ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 


More Telugu News