YS Jagan: జగన్ కు సుప్రీంకోర్టులో ఊరట

Supreme Court Releif To YS Jagan

  • రఘురామ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం
  • బెయిల్ రద్దు పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదన్న కోర్టు
  • తన పిటిషన్ ను వాపస్ తీసుకున్న రఘురామ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై టీడీపీ లీడర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈమేరకు సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర మిశ్రాల ధర్మాసనం తీర్పు చెప్పింది. జగన్ అక్రమాస్తుల కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని సుప్రీం గుర్తుచేసింది.

ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు కోసం ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదని తెలిపింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో గతంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకూ వర్తిస్తుందని పేర్కొంది. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ జరపాలని, హైకోర్టు కూడా పర్యవేక్షించాలని సూచించింది. అదే సమయంలో ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో తమ పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని రఘురామ తరఫు లాయర్ కోరగా.. ధర్మాసనం అందుకు అంగీకరించింది.

YS Jagan
YSRCP
Ex CM
Andhra Pradesh
Supreme Court
Raghurama
  • Loading...

More Telugu News