Sarathkumar: ఆ రోజు అవసరం లేదని.. ఇవాళ గవర్నర్‌ను విజయ్ ఎందుకు కలిశారు?: శరత్‌కుమార్

- చెన్నై టీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలకు శరత్‌కుమార్, ఖుష్బూ
- ఈ సందర్భంగా విజయ్‌పై శరత్‌కుమార్ విమర్శలు
- తన మొదటి మహానాడులో రాష్ట్రంలో గవర్నర్ అవసరం లేదన్న విజయ్ వ్యాఖ్యలను గుర్తుచేసిన నటుడు
ఆ రోజు రాష్ట్రానికి గవర్నర్ అవసరం లేదని చెప్పిన విజయ్ ఇవాళ ఆయన్ను ఎందుకు కలిశారని సీనియర్ నటుడు, బీజేపీ నేత శరత్‌కుమార్ ప్రశ్నించారు. ఆదివారం చెన్నై టీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఖుష్బూ, శరత్‌కుమార్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా శరత్‌కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో గవర్నర్ అవసరం లేదని, తన మొదటి మహానాడులో చెప్పిన విజయ్ ఆ తర్వాత గవర్నర్‌ను ఎందుకు కలిశారని ప్రశ్నించారు. విజయ్ గురించి ఎక్కువ మాట్లాడటం లేదని, ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు.
అటు టంగ్‌స్టన్ మైనింగ్ రద్దుకు అన్నామలై కారణమన్నారు. ఇక ఈ ఏడాది రాష్ట్రంలో 13 మందికి పద్మ అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నారు. అలాగే పద్మ పురస్కారం దక్కిన నటుడు అజిత్ కుమార్‌ను శరత్‌కుమార్ అభినందించారు.
అనంతరం ఖుష్బూ మాట్లాడుతూ.. జాతీయ గీతం, తమిళ తల్లి గీతం పాడేటప్పుడు భారతీయులం అనే భావన కలుగుతుందని అన్నారు. నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్‌లను పద్మ అవార్డులు వరించడం ఆనందంగా ఉందని తెలిపారు.