Rohit Sharma: రోహిత్‌శర్మను కలిసేందుకు మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన అభిమాని.. వీడియో ఇదిగో

Fan Invades Ranji Trophy Match To Meet Rohit Sharma
  • రంజీల బాట పట్టిన టీమిండియా స్టార్ ఆటగాళ్లు
  • ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్, యశస్వి, శ్రేయాస్ అయ్యర్
  • మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్‌ను కలిసేందుకు అభిమాని పరుగులు
  • పట్టుకుని బయటకు తీసుకెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది
టీమిండియా సారథి రోహిత్‌శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ ఆటగాళ్లు ఇటీవల తరచుగా విఫలం అవుతుండటంతో బీసీసీఐ ఆదేశాల మేరకు రంజీల్లో ఆడుతున్నారు. ఈ క్రమంలో ముంబై తరపున బరిలోకి దిగిన రోహిత్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఓ అభిమాని అయితే రోహిత్‌ను కలిసేందుకు స్టేడియంలోకి దూసుకొచ్చాడు.

ముంబైలోని బీకేసీ గ్రౌండ్‌లో ముంబై-జమ్మూకశ్మీర్ జట్లు తలపడుతున్నాయి. రోహిత్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న రోహిత్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో ఓ అభిమాని రోహిత్‌ను కలిసేందుకు మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ వద్దకు వచ్చి మొత్తానికి రోహిత్‌ను కలిశాడు.

గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. కాగా, రంజీల్లోనూ రోహిత్ నాసిరకం బ్యాటింగ్ కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు మాత్రమే చేసిన  రోహిత్, రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ కూడా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులు మాత్రమే చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్ విజయం సాధించింది.  
Rohit Sharma
Ranji Trophy
Fan
Viral Video

More Telugu News