Chandrababu: బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం పట్ల చంద్రబాబు, లోకేశ్ స్పందన

Chandrababu congratulates Balakrishna

  • లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని చంద్రబాబు ప్రశంస
  • ఎంతోమంది జీవితాలకు స్ఫూర్తినిచ్చిన నిజమైన ఐకానిక్ అంటూ కితాబు
  • తమ కుటుంబానికి గర్వకారణమన్న నారా లోకేశ్

సినీ నటుడు, హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. బాలకృష్ణకు అభినందనలు తెలిపారు.

లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తున్నారని, సినిమా, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. బసవతాకరం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమందిని కాపాడుతూ ప్రజాసేవ చేస్తున్నారని కొనియాడారు. ఎంతోమంది జీవితాలకు స్ఫూర్తినిచ్చిన నిజమైన ఐకానిక్ నాయకుడికి తగిన గౌరవం దక్కిందన్నారు.

గర్వకారణం: లోకేశ్

మామయ్య బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం తమ కుటుంబానికి గర్వకారణమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మీ సుదీర్ఘ ప్రయాణంలో బ్లాక్ బస్టర్ హిట్ల నుంచి మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చే వరకు సినిమా, రాజకీయం, ఆరోగ్య రంగంలో మీరు చేసిన సేవకు ఈ అవార్డు నిదర్శనమన్నారు. మీ విజయాలకు గుర్తింపు లభించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News