India vs England: రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా.. రెండు మార్పుల‌తో బ‌రిలోకి.. తెలుగు కుర్రాడు మిస్‌

India vs England 2nd T20I at Chennai

  • చెన్నై వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లండ్‌ రెండో టీ20
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • రింకూ, నితీశ్ రెడ్డి ఔట్‌.. సుంద‌ర్‌, జురెల్ ఇన్‌


చెన్నై వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు రెండు మార్పులు చేసింది. తొలి టీ20లో ఆడిన రింకూ సింగ్ తో పాటు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లో ఆడ‌డం లేదు. వారి స్థానంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, ధ్రువ్ జురెల్ ఆడుతున్నారు. మ‌రోసారి పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ షమీ బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. 

అటు ఇంగ్లండ్ కూడా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. జేమీ స్మిత్‌, బ్రైడాన్ కార్స్ ఆ జ‌ట్టు త‌ర‌ఫున ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తున్నారు. ఇక ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో ఆతిథ్య భార‌త్ తొలి మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం సాధించి బోణీ కొట్టిన విష‌యం తెలిసిందే.   

భారత్: సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.

ఇంగ్లండ్‌: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

  • Loading...

More Telugu News