ICC: ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. కెప్టెన్‌గా రోహిత్.. జట్టులో మనోళ్లకు నలుగురికి చోటు!

- భారత్ నుంచి రోహిత్, హార్దిక్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు
- గతేడాది టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో రోహిత్ కీరోల్
- ఇదే టోర్నీ అనంతరం టీ20ల నుంచి వైదొలిగిన హిట్‌మ్యాన్
మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024ను తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంచుకుంది. ఈ జట్టులో భారత్ నుంచి రోహిత్‌తో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది.
కాగా, గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా రాణించారు.
ఈ టోర్నీలో హిట్‌మ్యాన్ 378 పరుగులు చేశాడు. ఇదే టోర్నీ అనంతరం టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కూడా ఈ టోర్నీ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు అల్వీదా చెప్పిన విషయం తెలిసిందే.
మెన్స్ టీ20 టీమ్-2024: రోహిత్ శర్మ (కెప్టెన్; భారత్), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్; వెస్టిండీస్), సికందర్ రజా (జింబాబ్వే), హార్దిక్ పాండ్యా (భారత్), రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్), వానిందు హసరంగ (శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా (భారత్), అర్ష్‌దీప్ సింగ్ (భారత్).