Republic Day: మందుబాబుల‌కు బ్యాడ్‌న్యూస్‌.. రేపు మూత‌ప‌డ‌నున్న వైన్స్‌!

Wines and Meat Shops Closed Tomorrow due to Republic Day in AP and Telangana

  • రేపు రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మందు, మాంసం దుకాణాలు బంద్‌
  • ఈ మేర‌కు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదేశాలు
  • నిరాశ‌లో మందు, ముక్క‌తో వీకెండ్‌ను ఎంజాయ్ చేద్దామ‌నుకున్న జ‌నం 

రేపు గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మందు, మాంసం దుకాణాలు మూత‌ప‌డ‌నున్నాయి. తిరిగి సోమ‌వారం ఉద‌యం తెరుచుకుంటాయి. ఈ మేర‌కు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌ద్యం, మాంసం విక్ర‌యించే దుకాణదారుల‌కు ఆదేశాలు జారీ చేశాయి. అయితే, రేపు ఆదివారం కావ‌డంతో మందు, ముక్క‌తో వీకెండ్‌ను ఎంజాయ్ చేద్దామ‌నుకున్న వారికి ఇది బ్యాడ్‌న్యూస్ అనే చెప్పాలి. 

ఈరోజు రాత్రి నుంచే జంతు వ‌ధ‌ను నిషేధించిన‌ట్లు పేర్కొన్నాయి. ఒక‌వేళ ఎవ‌రైన ఈ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించాయి. అన్ని ప‌ట్ట‌ణాల్లోనూ ఇవే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక ఈ విష‌యం తెలిసిన మందుబాబులు ఇవాళ ఉద‌యం నుంచే వైన్స్ ముందు క్యూక‌డుతున్నారు. ముందుగానే త‌మ‌కు కావాల్సిన మ‌ద్యం బాటిళ్ల‌ను ఇంటికి తెచ్చుకుంటున్నారు. 

కాగా, స్వాతంత్ర్య దినోత్స‌వం, రిప‌బ్లిక్ డేతో గాంధీ జ‌యంతి వంటి జాతీయ దినోత్స‌వాల సంద‌ర్భంగా మ‌ద్యం, మాంసం విక్ర‌యాల‌పై ప్ర‌భుత్వాలు బంద్ చేస్తుంటాయ‌నే విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా రేప‌టి 76వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం కార‌ణంగా తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు మందు, ముక్క‌ల‌పై బంద్ విధించాయి. 

  • Loading...

More Telugu News