Rohit Sharma: ప్చ్‌.. రోహిత్ శ‌ర్మ ఉన్నా ముంబ‌యికి త‌ప్ప‌ని ఓట‌మి.. జ‌మ్మూ చేతిలో కంగుతిన్న డిపెండింగ్ ఛాంపియన్‌!

Defending Champions Mumbai Stunned By Jammu And Kashmir On Rohit Sharma Ranji Trophy Return

  • ఐదు వికెట్ల తేడాతో ముంబ‌యిని ఓడించిన జ‌మ్మూ
  • రంజీల్లో రోహిత్ రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే ఓడిన ముంబ‌యి
  • గ‌త కొంత‌కాలంగా ఫామ్‌లేక ఇబ్బంది ప‌డుతున్న రోహిత్‌
  • ఈ మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫ‌ల‌మైన హిట్‌మ్యాన్

రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో జ‌మ్మూక‌శ్మీర్ చేతిలో డిపెండింగ్ ఛాంపియ‌న్ ముంబ‌యి జ‌ట్టు అనూహ్యంగా ప‌రాజ‌యం పాలైంది. ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ముంబ‌యికి జ‌మ్మూ గ‌ట్టి షాకిచ్చింది. 5 వికెట్ల తేడాతో ముంబ‌యిని మట్టిక‌రిపించింది. 

ఇక ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత రంజీల్లో పునరాగమనం చేసిన‌ విష‌యం తెలిసిందే. ఇలా హిట్‌మ్యాన్ టీమ్‌లో చేరినా మొద‌టి మ్యాచ్ లోనే ముంబ‌యి ఓట‌మి చవిచూడ‌టం గ‌మ‌నార్హం.

ముంబ‌యి నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన జ‌మ్మూ ఐదు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ మొద‌టి ఇన్నింగ్స్ లో 3 ప‌రుగులు చేయ‌గా... రెండో ఇన్నింగ్స్ లో 28 ర‌న్స్ చేసి నిరాశ‌ప‌రిచాడు. అటు యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ కూడా ఘోరంగా విఫ‌లం అయ్యాడు. 

కాగా, గ‌త కొంత‌కాలంగా ఫామ్‌లేక తంటాలు ప‌డుతున్న రోహిత్.. రంజీల్లో ఆడి మునుప‌టి ఫామ్‌ను అందుకోవాల‌ని భావిస్తున్నాడు. కానీ, ఇక్క‌డ కూడా ఫెయిల్ కావ‌డంతో హిట్‌మ్యాన్‌ అభిమానులు తీవ్ర నిరాశ‌చెందారు. 
 

  • Loading...

More Telugu News