Dil Raju: ఫేక్‌ కలెక్షన్స్‌ పోస్టర్స్‌ మీద 'దిల్‌' రాజు నిర్ణయం ఇదే!

This is the decision of Dil Raju on fake collections posters

  • సినీ పరిశ్రమలో బ్లాక్‌ మనీ లేదన్న దిల్ రాజు  
  • కలెక్షన్స్‌ పోస్టర్స్‌పై నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్య 
  • ఐదేళ్లలో ఎలాంటి స్థిరాస్తులు కొనలేదని వెల్లడి 

ప్రముఖ నిర్మాత 'దిల్‌'రాజు ఆఫీస్‌తో పాటు ఇంటిలో గత నాలుగు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ వారు రైడ్స్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 'దిల్‌'రాజు ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు నివాసాల్లో కూడా సెర్చ్‌లు చేశారు. అయితే ఈ రైడ్స్‌ ముగిసిన నేపథ్యంలో దిల్‌ రాజు విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నాడు. 

'' సినీ పరిశ్రమలో బ్లాక్‌ మనీ అనేది లేదు. దాదాపుగా ఎనభై శాతం మంది ఆడియన్స్‌ టిక్కెట్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటున్నారు. ఇక బ్లాక్‌మనీ ఎక్కడి నుండి వస్తుంది' అని 'దిల్‌' రాజు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక ఫేక్‌ కలెక్షన్స్‌ పోస్టర్స్‌ వేయడం వల్లే నిర్మాతలు ఇలాంటి ఇబ్బందులను ఫేస్‌ చేయాల్సి వస్తుందా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, 

'' ఈ విషయంలో నిజంగా వాస్తవం ఉంటే త్వరలోనే నిర్మాతలు అందరం కలిసి ఓ సమావేశం పెట్టుకుని, దీని మీద నిర్ణయం తీసుకుంటాం. నేను వ్యక్తిగతంగా ఒక్కడినే ఈ విషయంపై మాట్లాడటం సమంజసం కాదు' అని చెప్పారు. మీ సినిమాలకు రాజకీయ నాయకులు పెట్టుబడులు పెడుతున్నారా? అని ఓ విలేకరి అడిగిన వెంటనే 'ఎవరైనా ఉంటే చెప్పండి? బయట మేము అధిక వడ్డీలు చెల్లిస్తున్నాం. మాకు కూడా వడ్డీలు చెల్లించే బాధ తప్పుతుంది'  అంటూ చమత్కరించారు. 

అయితే 'గత ఐదేళ్లుగా తను ఎటువంటి స్థిరాస్తులు కొనలేదని, ఎటువంటి ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టలేదని దిల్‌ రాజు ఈ సందర్భంగా తెలిపారు. 


  • Loading...

More Telugu News