AP High Court: ఏపీ హైకోర్టులో ఇద్దరు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

hariharanath sharma lakshman rao sworn in as additional judges of ap high court

  • ఇద్దరు అదనపు జడ్జిలతో ప్రమాణం చేయించిన సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌
  • హైకోర్టులో 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య 
  • అదనపు న్యాయమూర్తుల నియామకానికి 22న ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కొత్తగా నియమితులైన ఇద్దరు అదనపు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డా.యడవల్లి లక్ష్మణరావు లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌  ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తులుగా వీరిరువురు శుక్రవారం బాధ్యతలు చేపట్టడంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30 కి చేరింది. 
 
వీరిరువురిని పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సు మేరకు వీరిరువురిని అదనపు న్యాయమూర్తులుగా నియమించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22న ఆమోద ముద్రవేయడం జరిగింది.
 
హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ, అదనపు అడ్వకేట్ జనరల్ ఇ సాంబశివ ప్రతాప్, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ (ఎఫ్ఎసి) శ్రీనివాస శివరాం, పలువురు రిజిష్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News