Kodali Nani: తాను రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన కొడాలి నాని

- ఇవాళ రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, అయోధ్య రామిరెడ్డి
- అదే బాటలో కొడాలి నాని అంటూ వార్తలు
- అది ఫేక్ పోస్టు అంటూ స్పష్టం చేసిన కొడాలి నాని
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి చేసిన సంచలన ప్రకటనల నుంచి తేరుకోకముందే... కొడాలి నాని కూడా గుడ్ బై చెబుతున్నారంటూ వార్తలు రావడం కలకలం సృష్టించింది. అనారోగ్య కారణాల రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని కొడాలి నాని పేరిట ఉన్న ఓ ట్వీట్ ను ఉటంకిస్తూ... పలు మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.
దీనిపై కొడాలి నాని స్పందించారు. తాను రాజీనామా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టు ఫేక్ అని స్పష్టం చేశారు. ఎడిట్ చేసిన తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఓ ప్రకటన చేశారు. ఫేక్ న్యూస్ పోస్టును కూడా పంచుకున్నారు.