Bandla Ganesh: కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడమా?: విజయసాయిరెడ్డిపై బండ్ల గణేశ్ ట్వీట్

Bandla Ganesh tweet on VijayasaiReddy

  • అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో వదిలేస్తున్నారని విమర్శ
  • చాలామంది రాజకీయ నాయకులకు ఇది ఫ్యాషన్ అయిపోయిందని చురక
  • విజయసాయిరెడ్డి ట్వీట్‌ను పేర్కొన్న బండ్ల గణేశ్

రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ఏపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలివేయడం... వదిలి వెళ్లిపోవడం చాలామంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిందని విమర్శించారు. ఇది ధర్మమా? అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

కాగా, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, రేపు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని విజయసాయి రెడ్డి వెల్లడించారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, తన నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమన్నారు. జగన్‌కు మంచి జరగాలని ఆకాంక్షించారు. వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు.

Bandla Ganesh
Vijayasai Reddy
Telangana
YS Jagan
Andhra Pradesh

More Telugu News