Raja Singh: కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు

- ప్రజలను రక్షించాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారన్న రాజాసింగ్
- పోలీసు అధికారుల ఛాంబర్లలో కెమెరాలు పెట్టాలని సూచన
- లంచాలు తీసుకుంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శ
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లంచాలు పెరిగాయని బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులు ఏసీబీకి చిక్కడం బాధాకరమన్నారు. పోలీస్ అధికారుల ఛాంబర్లలో సీసీ కెమెరాలు పెట్టడమే కాకుండా లంచం తీసుకుంటూ పట్టుబడితే ఉద్యోగం నుంచి తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
లంచం తీసుకుంటున్న ఘటనలు ఎన్నో బయటకు వస్తున్నాయని, కానీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అవినీతిరహిత పాలనను అందిస్తామని మాత్రం హామీ ఇవ్వలేకపోతోందని ఎద్దేవా చేశారు.