ICC Test Team Of The Year: ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ లో ముగ్గురు టీమిండియా క్రికెటర్లకు చోటు

Three Indian players gets placed in ICC Test Team The Year 2024

  • 2024 ఏడాదికి గాను టెస్ట్ టీమ్ ను ప్రకటించిన ఐసీసీ
  • కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్
  • జైస్వాల్, జడేజా, బుమ్రాలకు చోటు

ఐసీసీ పురుషుల టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్-2024ను నేడు ప్రకటించింది. ఐసీసీ వన్డే టీమ్ లో  ఒక్కరంటే ఒక్కరు కూడా టీమిండియా నుంచి ఎంపిక కాకపోగా... ఐసీసీ టెస్ట్ టీమ్ లో మాత్రం ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు స్థానం లభించింది. 11 మందితో కూడిన టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు చోటు దక్కించుకున్నారు. 

కాగా, ఈ ఐసీసీ టెస్ట్ టీమ్ కు ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. 

ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్...
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్)- ఆస్ట్రేలియా
యశస్వి జైస్వాల్- భారత్
బెన్ డకెట్- ఇంగ్లండ్
కేన్ విలియమ్సన్- న్యూజిలాండ్
జో రూట్- ఇంగ్లండ్
హ్యారీ బ్రూక్- ఇంగ్లండ్
కమిందు మెండిస్- శ్రీలంక
జేమీ స్మిత్ (వికెట్ కీపర్)- ఇంగ్లండ్
రవీంద్ర జడేజా- భారత్
మ్యాట్ హెన్రీ- న్యూజిలాండ్
జస్ప్రీత్ బుమ్రా- భారత్ 


  • Loading...

More Telugu News