Samyuktha Menon: 'అఖండ 2' లో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ... అధికారికంగా ప్రకటించిన మేకర్స్!

- బాలకృష్ణ, బోయపాటి కాంబోలో 'అఖండ 2'
- ఈ మూవీలో మరో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్
- 'ఎక్స్' వేదికగా ప్రకటించిన మేకర్స్
ఈ సంక్రాంతి పండక్కి నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 'అఖండ 2'తో బిజీగా ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'అఖండ'కు ఇది సీక్వెల్. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది.
అయితే, తాజాగా మేకర్స్ ఈ సినిమాలో నటించనున్న మరో హీరోయిన్ పేరును వెల్లడించారు. యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ 'అఖండ 2'లో నటించనున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ పోస్టు పెట్టారు.
"టాలెంటెడ్ నటి సంయుక్తకు 'అఖండ 2' ప్రాజెక్ట్ లోకి స్వాగతం. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదల కానుంది" అని మేకర్స్ పోస్ట్ చేశారు.
ఇక, ఈనెలాఖరు నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. తమన్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా, ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరో హీరోయిన్‌గా సంయుక్త చేరారు. ఇది ఆమెకు పెద్ద ఆఫర్ అనే చెప్పాలి. సీనియర్ హీరోలతో ఇప్పటిదాకా తను జత కట్టలేదు. నిఖిల్, ధనుష్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్ లతో మాత్రమే కలిసి నటించింది.