fog: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పొగమంచు .. విమానాల రాకపోకలకు అంతరాయం

fog in telugu states

  • గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద గాల్లో చక్కర్లు కొట్టిన ఇండిగో విమానం
  • వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రికి మళ్లింపు
  • విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఫ్లడ్ లైట్ ల వెలుగులతో నెమ్మదిగా ముందుకు వెళుతున్న వాహనాలు

తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురిసింది. పొగమంచు కారణంగా విమానాలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. అప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో అధికారులు విమానాన్ని రాజమండ్రికి మళ్లించారు. 

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో దట్టంగా మంచు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో హైవేపై హెడ్ లైట్ల వెలుగులో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

fog
Andhra Pradesh
Telangana
gannavaram air port
  • Loading...

More Telugu News