laila movie: మా నాన్న నన్ను గుర్తుపడతారేమో అని చాలాసేపు చూశాను: విష్వక్సేన్

vishwaksen about lady getup in laila movie

  • రామ్ నారాయణ్ దర్శకత్వంలో విష్వక్‌సేన్ నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ లైలా 
  • ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు 
  • చిత్రంలో అబ్బాయిగా, అమ్మాయిగా రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేస్తున్న విష్వక్ 

రామ్ నారాయణ్ దర్శకత్వంలో విష్వక్సేన్ నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'లైలా' చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్ర నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసుకోగా, ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ఫిబ్రవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ మూవీ నుంచి 'ఇచ్చుకుందాం బేబీ.. ముద్దు ఇచ్చుకుందాం బేబీ' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను గురువారం విడుదల చేశారు. ఈ చిత్రంలో విష్వక్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ సందర్భంగా విష్వక్సేన్ మాట్లాడుతూ.. తన కేరీర్ లో ఇంత ఫన్ రైడ్ మూవీ చేయలేదన్నారు.  

లేడీ గెటప్‌లో తనని తన తండ్రి కూడా గుర్తు పట్టలేదని అన్నారు. మూవీ కోసం లైలా (లేడీ) గెటప్ వేసుకున్న తర్వాత మా నాన్నకు వీడియో కాల్ చేయగా, గుర్తు పట్టలేదని, లేడీ గెటప్‌లో ఉన్న తాను డాడీ అని పిలిచే సరికి ఆయన ఒక్కసారిగా కంగారు పడ్డారన్నారు. ఈ మూవీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్నారు.   

  • Loading...

More Telugu News