Birth Right Citizenship: జన్మతః పౌరసత్వ రద్దుపై డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టు షాక్!

US judge temporarily blocks Trumps order on birthright citizenship

  • ప్రమాణ స్వీకారం చేస్తూనే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలు
  • వీటిని సవాలు చేస్తూ కోర్టులను ఆశ్రయించిన 22 రాష్ట్రాలు
  • ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా పక్కనపెట్టిన సియాటిల్ కోర్టు

జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సియాటిల్ ఫెడరల్ కోర్టు షాకిచ్చింది. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ వాటిని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీచేశారు. వాటిలో జన్మతః పౌరసత్వ రద్దు కూడా ఒకటి. 

ట్రంప్ ఆదేశాలపై అమెరికా వ్యాప్తంగా కలకలం రేగింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికాలోని 22 రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించాయి. ట్రంప్ ప్రత్యర్థి పార్టీ డెమొక్రాట్ల నేతృత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఓరెగాన్ రాష్ట్రాలు సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వాదించాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆ ఆదేశాలను తాత్కాలికంగా పక్కనపెడుతూ ఆదేశాలు జారీచేసింది.

  • Loading...

More Telugu News