Gandhi Thatha Chettu: 'గాంధీ తాత చెట్టు' సినిమాపై మహేశ్ బాబు రివ్యూ

Mahesh Babu opines on Gandhi Thatha Chettu movie

  • సుకుమార్ తనయ సుకృతివేణి ప్రధాన పాత్రలో గాంధీ తాత చెట్టు
  • పద్మావతి మల్లాది దర్శకత్వం
  • రేపు (జనవరి 24) విడుదల
  • నేడు మీడియా కోసం ప్రివ్యూ

దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివేణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శేష సింధూ రావు నిర్మాతగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ అర్ధాంగి తబిత సమర్పించారు. ఈ చిత్రం రేపు (జనవరి 24) విడుదల కానుండగా... నేడు హైదరాబాదులో మీడియా కోసం ప్రివ్యూ ప్రదర్శించారు.  

కాగా, ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన అభిప్రాయాలను పంచుకున్నారు. గాంధీ తాత చెట్టు... ఈ చిత్రం మనతో ఉండిపోతుంది. అహింస గురించి ఎంతో పదునైన కథాంశంతో ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఈ అందమైన కథకు దర్శకురాలు పద్మావతి మల్లాది జీవం పోశారు. ఇక, నా చిన్ని నేస్తం సుకృతివేణి... నీ నటన పట్ల అమితంగా గర్విస్తున్నాను. నువ్వు ఇంత ప్రతిభావంతమైన నటిగా ఎదగడం, శక్తిమంతమైన నటను ప్రదర్శించడం చూస్తుంటే హృదయం ఆనందంతో నిండిపోతోంది. వెళ్లండి...  ఈ చిన్ని కళాఖండాన్ని చూడండి" అని మహేశ్ బాబు పిలుపునిచ్చారు.

Gandhi Thatha Chettu
Mahesh Babu
Sukritiveni
Padmavati Malladi
Thabitha Sukumar
Tollywood
  • Loading...

More Telugu News