Anantapur: అనంత‌పురం నారాయ‌ణ‌ కాలేజీ బిల్డింగ్‌ నుంచి దూకేసిన విద్యార్థి... షాకింగ్‌ వీడియో!

Student Commits Suicide Jumping from College Building in Anantapur

  • అనంత‌పురం నారాయ‌ణ‌ కాలేజీలో ఇంట‌ర్ విద్యార్థి చ‌ర‌ణ్ ఆత్మ‌హ‌త్య‌
  • బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ సీసీటీవీ ఫుటేజ్
  • ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్‌

ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి కాలేజీ బిల్డింగ్‌ నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం తీవ్ర కలకలం రేపుతోంది. అందరితో పాటు క్లాసులో కూర్చున్న అత‌డు ఉన్నట్టుండి క్లాస్‌ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అమాంతం తానున్న మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు.

అనంతపురం జిల్లాలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఈరోజు ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీని తాలూకు సీసీటీవీ ఫుటేజీ తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

అనంతపురం నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి ఇలా బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. 

క్లాస్ లో అందిరితో పాటు కూర్చున్న విద్యార్థి ఒక్కసారిగా లేచి వెళ్లి, చెప్పులు విప్పేసి కారిడార్ నుంచి కిందకు దూకేశాడు. దాంతో తరగతిలో ఉన్న లెక్చరర్ తో పాటు విద్యార్థులంతా షాకయ్యారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ చరణ్‌ను ఆసుపత్రికి తీసుకెళుతుండగానే ప్రాణాలు కోల్పోయాడు. 

చ‌ర‌ణ్ స్వ‌స్థ‌లం రామాపురంగా పోలీసులు గుర్తించారు. ఇటీవ‌ల సంక్రాంతి సెల‌వుల‌కు ఇంటికి వ‌చ్చి వెళ్లిన కుమారుడు ఇంత‌లోనే ఆత్మ‌హ‌త్య చేసుకోవడంతో త‌ల్లిదండ్రులు బోరున విల‌పిస్తున్నారు. అతడి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


More Telugu News