Nimmala Rama Naidu: పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు

Nimmala Rama Naidu inspects Polavaram Project works

  • డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించిన నిమ్మల రామానాయుడు
  • నిర్వాసితుల ఖాతాల్లోకి వెయ్యి కోట్లు జమ చేశామని వెల్లడి
  • మూడు కట్టర్ల ద్వారా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్న మంత్రి

ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ఇటీవల ప్రారంభమైన డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించారు. యంత్రాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న ప్రయోగశాలను సందర్శించి ప్యానల్ తవ్వకాల్లో వస్తున్న మెటీరియల్ ను పరిశీలించారు. 

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... పోలవరం నిర్వాసితుల అకౌంట్లలోకి ఇటీవల వెయ్యి కోట్లు జమ చేశామని తెలిపారు. మూడు కట్టర్ల ద్వారా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి రెండో కట్టరు పని చేస్తుందని... మూడో కట్టరు ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వెయ్యి కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టామని అన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. 

Nimmala Rama Naidu
Telugudesam
Polavaram Project
  • Loading...

More Telugu News