Nara Lokesh: మంత్రి లోకేశ్‌కు చిరు బ‌ర్త్‌డే విషెస్‌

Megastar Chiranjeevi Birthday Whishes to Nara Lokesh

  • నేడు మంత్రి నారా లోకేశ్ పుట్టిన‌రోజు
  • ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లువెత్తుతున్న శుభాకాంక్ష‌లు
  • తాజాగా లోకేశ్‌కు చిరు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ ట్వీట్‌

నేడు ఏపీ మంత్రి నారా లోకేశ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన‌రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లోకేశ్‌కు మెగాస్టార్ చిరంజీవి 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. 

"ప్రియ‌మైన లోకేశ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ‌ చేయాల‌నే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మ‌రింత అభివృద్ధి సాధించేలా పాటుప‌డ‌టం హ‌ర్ష‌ణీయం. మీరు చేసే అన్ని ప్ర‌య‌త్నాల‌లో విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఏడాది మీకు అద్భుతంగా సాగాల‌ని కోరుకుంటున్నాను" అని చిరు ట్వీట్ చేశారు. 

Nara Lokesh
Chiranjeevi
Birthday Whishes
Andhra Pradesh

More Telugu News