Arshdeep Singh: చాహల్ రికార్డును బద్దలు కొట్టిన అర్షదీప్ సింగ్

- ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం
- టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అర్షదీప్ రికార్డు
- అతడి ఖాతాలో ప్రస్తుతం 97 వికెట్లు
- 61వ టీ20లోనే ఘనత
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి కోల్‌కతాలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ అర్షదీప్ సింగ్ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో యుజ్వేంద్ర చాహల్ రికార్డు బద్దలైంది.
ఈ మ్యాచ్‌లో ఫిలిప్ సాల్ట్, డకెట్ వికెట్లు తీసిన అర్షదీప్ ఖాతాలో మొత్తం 97 వికెట్లు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అర్షదీప్ తన 61వ టీ20లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇప్పటి వరకు 96 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న చాహల్ రికార్డు బద్దలైంది. ఇక, 90 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ మూడో స్థానంలో, 89 వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వరుసగా నాలుగైదు స్థానాల్లో కొనసాగుతున్నారు.