Team India: టీమిండియా-ఇంగ్లండ్ తొలి టీ20... టాస్ మనదే!

- టీమిండియా-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్
- నేడు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో తొలి టీ20
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు తెరలేచింది. నేడు ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ పోరుకు వేదిక. టాస్ గెలిచిన టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
రాత్రి వేళ మంచు ఎక్కువగా కురుస్తుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెకండ్ బ్యాటింగ్ చేసే సమయంలో మంచు కారణంగా బంతిపై గ్రిప్ జారిపోతూ ఉంటుంది. దాంతో బౌలర్లు ఇబ్బందిపడుతుంటారు. ఇక, ఇరు జట్ల టీ20 స్పెషలిస్టులతో బలంగా కనిపిస్తుండడంతో హోరాహోరీ పోరు ఖాయమనిపిస్తోంది.
టీమిండియా...
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
రిజర్వ్ బెంచ్...
మహ్మద్ షమీ, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా
ఇంగ్లండ్ జట్టు...
జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, లియాం లివింగ్ స్టోన్, జాకబ్ బెతెల్, జేమీ ఒవెర్టన్, గస్ ఆట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ ఉడ్.