Seethakka: గతంలో ఫామ్ హౌస్ లో లబ్ధిదారులను ఎంపిక చేశారు: సీతక్క

Seethakka on Grama Sabhas

  • నిన్న 3,410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయన్న సీతక్క
  • 96 శాతం గ్రామాల్లో గ్రామసభలు ప్రశాంతంగా జరిగాయని వెల్లడి
  • గ్రామసభలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య

రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 3,410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు. 96 శాతం గ్రామాల్లో ప్రశాంతంగా గ్రామసభలు జరిగాయని చెప్పారు. పదేళ్ల తర్వాత గ్రామసభలు జరిగినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. గ్రామసభల ద్వారా పథకాలకు లబ్ధిదారులను గుర్తిస్తున్నామని చెప్పారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫామ్ హౌస్ లో కూర్చొని లబ్ధిదారులను ఎంపిక చేశారని దుయ్యబట్టారు. గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వారికే పథకాలు అందాయని విమర్శించారు. తమ ప్రజాప్రభుత్వంలో గ్రామసభల్లో ప్రజల మధ్యే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. 

Seethakka
Congress
  • Loading...

More Telugu News