Naga Shaurya: యంగ్ హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్‌.. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌!

Naga Shaurya New Avatar as Bad Boy Karthik

  • నేడు యంగ్ హీరో నాగ శౌర్య పుట్టిన‌రోజు
  • ఈ సందర్భంగా ఆయన న‌టిస్తున్న కొత్త సినిమా పోస్ట‌ర్ విడుద‌ల‌
  • 'బ్యాడ్ బాయ్ కార్తీక్' పేరుతో తెర‌కెక్కుతున్న మూవీ
  • ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో వైల్డ్‌గా క‌నిపిస్తున్న నాగ శౌర్య

నేడు టాలీవుడ్ యంగ్‌ హీరో నాగ శౌర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ నాగ శౌర్య న‌టిస్తున్న‌ కొత్త సినిమా పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 'బ్యాడ్ బాయ్ కార్తీక్' పేరుతో తెర‌కెక్కుతున్న ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో నాగశౌర్య గతంలో ఎన్నడూ లేని విధంగా వైల్డ్ గా కనిపించారు. వ్యాన్ వెనక భాగంలో కూర్చుని, చేతులకు రక్తం కారుతుండగా, నుదుటిపై అదే రక్తాన్ని విభూదిలా పెట్టుకుని సీరియస్ లుక్ లో దర్శనమిచ్చారు. 

ఈ చిత్రానికి కొత్త డైరెక్ట‌ర్‌ రామ్ దేశిన దర్శకత్వం వ‌హిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్న ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో నాగశౌర్య సరసన క‌థానాయిక‌గా కొత్త అమ్మాయి విధి నటిస్తోంది. అలాగే ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో సముద్రఖని, సాయికుమార్, సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, శ్రీదేవి విజయ్ కుమార్ న‌టిస్తున్నారు. 

చాలా గ్యాప్ త‌ర్వాత ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు హ్యారీశ్‌ జయరాజ్  'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమాకు బాణీలు అందిస్తున్నారు. ఇంకా విడుద‌ల తేదీ ఖ‌రారు కాని ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటోంది. 

More Telugu News