Mohammed Siraj: టోలిచౌకిలో భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ సందడి.. ఇదిగో వీడియో!

హైదరాబాద్ ఓల్డ్‌సీటీలోని టోలిచౌకి ఆర్‌టీఓ కార్యాలయంలో టీమిండియా క్రికెటర్, డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ మంగళవారం సందడి చేశాడు. నిన్న సాయంత్రం తన కొత్త రేంజ్ రోవర్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్‌టీఓ ఆఫీస్ కు వెళ్లాడు. ఈ సందర్భంగా అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇక స్టార్ పేసర్ కార్యాలయానికి రావడంతో అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో టోలిచౌక్ ఆర్టీవో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. సిరాజ్ రాకతో ఆర్‌టీఓకు వచ్చిన జనాలు అతనితో ఫొటో దిగేందుకు ఆసక్తి చూపించారు.