Team India: భారత్-ఇంగ్లండ్ మధ్య నేడే తొలి టీ20.. ప్రత్యర్థి జట్టు ఇదే!

England Announce Playing XI For First T20 Against India

  • ఏడాది తర్వాత జట్టులోకి గస్ అట్కిన్సన్
  • బౌలర్లు, బ్యాటర్లతో సమతూకంగా కూర్పు
  • గత సిరీస్‌లో విండీస్‌పై విజయం సాధించిన ఉత్సాహంతో ఇంగ్లండ్

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో నేడు కోల్‌కతాలో జరగనున్న తొలి మ్యాచ్‌‌కు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. బౌలర్లు, ఆల్‌రౌండర్లతో సమతూకంగా ఉండేలా జట్టును ఎంపిక చేసింది. పేసర్ గస్ అట్కిన్సన్‌ ఏడాది తర్వాత జట్టులోకి వచ్చాడు. 2023 డిసెంబర్‌లో చివరిసారి అతడు వెస్టిండీస్‌తో ఆడాడు. ఇక, ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆదిల్ రషీద్‌ను ఎంపిక చేసింది. లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వ్యవహరిస్తారు. ఫిల్‌సాల్ట్, బెన్ డకెట్ కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. జోస్ బట్లర్ జట్టును నడిపిస్తాడు.

ఇంగ్లండ్ జట్టు: ఫిల్‌సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ బాథెల్, జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా అర్చర్, అదిల్ రషద్, మార్క్‌వుడ్.

ఇంగ్లండ్ తన చివరి టీ20 సిరీస్‌ను విండీస్‌తో ఆడింది. ఐదు మ్యా‌చ్‌ల ఆ సిరీస్‌ను 3-1తో విజయం సాధించింది. ఇండియా చివరిసారి సౌతాఫ్రికాతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఇందులో భారత్ 3-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు జరగ్గా ఇంగ్లండ్ 11 సార్లు విజయం సాధించింది. భారత గడ్డపై 11 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో గెలిచింది.

ఇక, మడమ నొప్పితో బాధపడుతూ ఏడాది కాలంగా జట్టుకు దూరమైన వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌కు కూడా జట్టులో స్థానం లభించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్‌రెడ్డికి కూడా టీ20 జట్టులో చోటు లభించింది.

ఇరు జట్ల మధ్య నేడు కోల్‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌తో తొలి మ్యాచ్ జరగనుండగా 25న చెన్నై, 28న రాజ్‌కోట్, 31న పూణే, ఫిబ్రవరి 2న ముంబైలో మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి వన్డే ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో జరగనుండగా, 9న కటక్‌లో రెండో వన్డే, 12న అహ్మదాబాద్‌లో చివరి వన్డే జరుగుతాయి. 

  • Loading...

More Telugu News