APSRTC: ఈ సంక్రాంతి సీజన్ లో ఏపీఎస్ఆర్టీసీకి భారీగా ఆదాయం

APSRTC earned huge income in Sankranti festive season

  • సంక్రాంతి డిమాండ్ దృష్ట్యా 9,097 ప్రత్యేక సర్వీసులు నడిపిన ఆర్టీసీ
  • ఈ నెల 20వ తేదీ ఒక్క రోజునే రూ.23.71 కోట్ల ఆదాయం
  • వరుసగా మూడు రోజుల పాటు రూ.20 కోట్లకు పైగా రాబడి

సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ఉండే కోలాహలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి సంబరాల కోసం ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారు స్వస్థలాలకు చేరుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. దాంతో పండుగకు ముందు, ఆ తర్వాత బస్సులు, రైళ్లు కిటకిటలాడుతుంటాయి. భారీ డిమాండ్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రయాణికుల కోసం సంక్రాంతి సీజన్ లో పెద్ద ఎత్తున అదనపు బస్సులు ఏర్పాటు చేస్తుంటాయి. 

ఈ నేపథ్యంలో, తాజా సంక్రాంతి సీజన్ లో ఏపీఎస్ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయం కళ్లజూసింది. ఏపీఎస్ఆర్టీసీ ఈ నెల 8 నుంచి 20వ తేదీ వరకు 9,097 అదనపు సర్వీసులు నడిపింది. ఈ నెల 20వ తేదీ ఒక్కరోజునే ఆర్టీసీకి రూ.23.71 కోట్ల ఆదాయం వచ్చింది. 

మూడు రోజుల పాటు రోజుకు రూ.20 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ సంక్రాంతి సీజన్ లో కేవలం ప్రత్యేక బస్సుల ద్వారానే రూ.21.11 కోట్లు వచ్చినట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.

  • Loading...

More Telugu News