Kancharla Bhupal Reddy: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై దాడి

- నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో కేటీఆర్ ఫ్లెక్సీల తొలగింత
- ఫ్లెక్సీల తొలగింపుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
- కోమటిరెడ్డి అనుచరులు దాడి చేశారన్న భూపాల్ రెడ్డి
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై దాడి జరిగింది. నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఈ దాడి జరిగింది. మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో కంచర్ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ వర్గీయులు... భూపాల్ రెడ్డిపై దాడి చేశారు.
ఇరుపార్టీ వర్గాలు పరస్పరం దాడులు చేసుకొని... పూలకుండీలు విసురుకున్నారు. ఈ ఘటనలో కంచర్ల భూపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.
అనంతరం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ప్లాన్ ప్రకారమే తమపై దాడి చేయించారని ఆరోపించారు. తమపై ఆయుధాలతో దాడి చేశారన్నారు. విచక్షణ మరిచి మహిళలను వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు.