Sai Tamahankar: శివాజీ కాలం నాటి నిధి రహస్యం .. 'ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్' సిరీస్!

The Secret Of Shikedars Web Series Update

  • హాట్ స్టార్ కి 'ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్'
  • నిధి కోసం సాగే అడ్వెంచర్ థ్రిల్లర్
  • ఆసక్తిని రేకెత్తించిన ట్రైలర్  
  • ఈ నెల 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్


హిందీ నుంచి ఇప్పుడు మరో భారీ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. భారీ తారాగణంతో... పెద్ద బడ్జెట్ తో నిర్మితమైన 'ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్' ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఆదిత్య సర్పోర్టదార్ దర్శకతం వహించిన సిరీస్ ఇది. గతంలో ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన 'ముంజ్యా' హిట్ కావడంతో, సహజంగానే ఈ సిరీస్ పై అంచనాలు ఉన్నాయి. 

ఇది అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ. మరాఠాలోని ఒక నవల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. సాయి తంహనకర్, రాజీవ్ ఖండేపాల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 31వ తేదీ నుంచి 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 

శివాజీ మహారాజ్ కాలంలో భద్రపరచబడిన ఒక నిధి రహస్యం శీలేదార్స్ కి తెలుస్తుంది. ఆ నిధిని కాపాడవలసిన బాధ్యత తమపైనే ఉందనే విషయం వారికి ఆలస్యంగా అర్థమవుతుంది. దాంతో ఆ నిధి ఎక్కడ ఉందనేది తెలుసుకుని, దానిని సంరక్షించడానికి రంగంలోకి దిగుతారు. అయితే ఈ నిధిని కాజేయడానికి ఒక బ్యాచ్ ప్లాన్ చేస్తుంది. ఆ నిధి విషయంలో ఎవరికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనేది కథ. 

  • Loading...

More Telugu News