black ink for writing cheques: నల్ల సిరాతో రాసిన చెక్కులు చెల్లుతాయా లేదా... కేంద్రం ఏం చెబుతోందంటే!

- సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన పీఐబీ
- ఆర్‌బీఐ అలాంటి ప్రకటన ఏమీ జారీ చేయలేదన్న పీఐబీ
- ఆర్‌బీఐ పేరుతో జరుగుతున్న ప్రచారం ఫేక్ అన్న పీఐబీ
'కొత్త ఏడాదిలో కొత్త రూల్స్.. నలుపు సిరాతో రాసిన చెక్కులు చెల్లుబాటు కావు.. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది' అంటూ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తను ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించినట్లు సర్క్యులేట్ చేయడంతో సామాన్య ప్రజానీకం అయోమయానికి గురయింది.
దీనిపై పీఐబీ ప్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఆ ప్రచారాన్ని కేంద్రం ఖండించిందని పేర్కొంది. దీనికి సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ పేరిట జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా వెల్లడించింది.