Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Hyderabad police arrested techie

  • టెక్కీ వద్ద నుంచి రూ.21 లక్షల విలువైన 120 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్స్ స్వాధీనం
  • అదనపు ఆదాయం కోసం డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు
  • తోటి ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించిన పోలీసులు

హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.21 లక్షల విలువైన 120 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అదనపు ఆదాయం కోసం డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

జమ్ము కశ్మీర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలిపారు. సమాచారం తెలియడంతో సంగారెడ్డి జిల్లా టాస్క్‌ఫోర్స్, స్థానిక ఎక్సైజ్ పోలీసులు... పుణే నుంచి హైదరాబాద్‌కు వాహనంలో తీసుకువస్తున్న ఎండీఎంఏ కిస్టల్ డ్రగ్స్‌ను సీజ్ చేశారు.

దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మొదట డ్రగ్స్‌కు బానిస అయినట్లు తెలిపారు. వస్తున్న జీతం అంతా వాటికే ఖర్చు అవుతుండటంతో డ్రగ్స్‌ను విక్రయించడం మొదలు పెట్టాడన్నారు. క్రమంగా తోటి ఉద్యోగులకు డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. దీనికి సంబంధించి కేసు నమోదు దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు.

Hyderabad
Tech-News
Telangana
  • Loading...

More Telugu News