Joe Biden: అధ్యక్షుడిగా చివరి గంటల్లో... జో బైడెన్ అతి కీలక నిర్ణయం!

- పలువురికి క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్
- ట్రంప్‌ను విమర్శించిన వైద్య నిపుణుడు ఫౌచీ తదితరులకు క్షమాభిక్ష
- ట్రంప్ ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పలువురికి క్షమాభిక్ష
అమెరికా అధ్యక్ష పదవీకాలం ముగియడానికి కొన్ని గంటల ముందు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో డొనాల్డ్ ట్రంప్‌ను విమర్శించిన అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్ష ఆదేశాలు జారీ చేశారు. క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన ఆరుగురు హౌస్ కమిటీ సభ్యులకు కూడా ఊరట కల్పించే చర్యలు తీసుకున్నారు.
ట్రంప్ అధికారం చేపట్టాక తనను విమర్శించిన వారిపై, ఇతరులపై ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం లేకుండా జో బైడెన్ ఈ చర్యలు చేపట్టారు. డొనాల్డ్ ట్రంప్ మరికాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి పదిన్నర గంటలకు ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.