KTR: జైల్లో ఉన్నప్పుడు కవిత ఆరోగ్యం బాగాలేదని వార్తలొచ్చాయి... ఆమె ప్రెస్‌మీట్ పెట్టాలి: రఘునందన్ రావు సెటైర్

- పసుపు బోర్డుపై కవిత వ్యాఖ్యల మీద స్పందించిన రఘునందన్ రావు
- ట్రీట్‌మెంట్ తర్వాత కవిత ప్రెస్‌మీట్ పెట్టాలని ఎద్దేవా
- అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌కు రైతులు గుర్తుకు రాలేదన్న బీజేపీ ఎంపీ
కవిత అరెస్టై జైల్లో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగాలేదని వార్తలు వచ్చాయని, ఆమె ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ ఎద్దేవా చేశారు. కేంద్రం పసుపు బోర్డు ఇవ్వడంపై కవిత ఇటీవల స్పందించారు. పసుపు బోర్డు రావడం సంతోషమేనని... కానీ బీజేపీ రాజకీయ కోణంలో దీనిని ప్రకటించిందని కవిత ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై రఘునందన్ రావు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
జైల్లో ఉన్నప్పుడు కవిత ఆరోగ్యం బాగాలేదని వార్తలు వచ్చాయని, కానీ ఇప్పటికీ ఆమె ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ రైతు ధర్నాపై కూడా విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌కు రైతులు గుర్తుకు రాలేదని మండిపడ్డారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ చుట్టూ ఉన్న రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు.