Chandrababu: దావోస్ లో ఘనస్వాగతం వీడియో షేర్ చేసిన చంద్రబాబు

Chandrababu shares video of grand welcome in Davos

  • దావోస్ చేరుకున్న చంద్రబాబు టీమ్
  • భారీ ఎత్తున తరలివచ్చిన యూరప్ లోని తెలుగువారు
  • అందరితో ఆప్యాయంగా మాట్లాడిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, అధికారులతో కూడిన కూటమి ప్రభుత్వ బృందం దావోస్ చేరుకుంది. దావోస్ లో చంద్రబాబు టీమ్ కు ఘనస్వాగతం లభించింది. యూరప్ దేశాల్లోని తెలుగువారు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడంతా కోలాహలంగా మారింది. 

తెలుగు వారు పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. చంద్రబాబు వారందరికీ అభివాదం చేస్తూ, కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు... భుజాలపై చేతులేసి ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసిన చంద్రబాబు... దావోస్ లో హార్దిక స్వాగతం పలికిన యూరప్ లోని తెలుగు సమాజానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు.

More Telugu News