Rahul Gandhi: సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్

Rahul Gandhi gets relief in Supreme Court

  • అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసు
  • పరువునష్టం కేసు వేసిన బీజేపీ కార్యకర్త
  • బాధిత వ్యక్తి మాత్రమే పరువునష్టం కేసు వేయగలరన్న రాహుల్ తరపు న్యాయవాది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ పై పరువునష్టం కేసు నమోదయింది. ఈ కేసులో రాహుల్ పై క్రిమినల్ విచారణను నిలిపివేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. రాహుల్ పై బీజేపీ కార్యకర్త నవీన్ ఝా వేసిన పరువునష్టం కేసును కొట్టివేసింది. 

రాహుల్ గాంధీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. రాహుల్ తరపున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. బాధిత వ్యక్తి మాత్రమే పరువునష్టం కేసు వేయగలరని... ప్రాక్సీ పార్టీ ద్వారా ఫిర్యాదు చేయలేమని చెప్పారు. ఇదే విషయాన్ని న్యాయస్థానాలు అనేక తీర్పుల ద్వారా వెల్లడించాయని తెలిపారు.  

  • Loading...

More Telugu News