Fire In Car: చౌటుప్పల్ లో రన్నింగ్ కారులో మంటలు.. వీడియో ఇదిగో!

--
హైవేపై వేగంగా దూసుకెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు రేగడంతో సడెన్ బ్రేక్ వేసి డ్రైవర్, ప్రయాణికులు బయటపడ్డారు. మంటల్లో కారు మొత్తం దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారులో చౌటుప్పల్ సమీపంలో వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో డ్రైవర్ తో పాటు అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారును పక్కకు నిలిపేశాడు. డ్రైవర్, ప్రయాణికులు బయటపడిన కాసేపటికే మంటలు మొత్తం వ్యాపించి కారు పూర్తిగా దగ్దమైంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో మంటలు చెలరేగాయని స్థానికులు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దగ్దమైన కారును రోడ్డు పైనుంచి పక్కకు తీయించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.