Ravindra Jadeja: దేశవాళీ క్రికెట్ బాటపడుతున్న టీమిండియా క్రికెటర్లు

- అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో అందుబాటులో ఉండే ఆటగాళ్లు తప్పకుండా దేశవాళీ లీగ్‌ల్లో ఆడాలని స్పష్టం చేసిన బీసీసీఐ
- 2015 తర్వాత తొలి సారి రంజీ మ్యాచ్‌కి సిద్ధమవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో అందుబాటులో ఉండే ఆటగాళ్లు తప్పకుండా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని, ఇందులో స్టార్ ప్లేయర్లకు మినహాయింపులు ఉండవని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దేశవాళీ క్రికెట్‌కు కొత్త కళ రానుంది. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2015 తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్ కు సిద్ధమవుతున్నాడు. గురువారం జమ్మూకశ్మీర్‌తో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం రంజీ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయ్‌దేవ్ షా ఆదివారం వెల్లడించాడు జనవరి 23 నుంచి రాజ్‌కోట్‌లో ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో జడేజా ఆడనున్నాడు.
జడేజా 2023 జనవరిలో చివరిగా రంజీలో ఆడాడు. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్‌పంత్ కూడా రంజీ ట్రోఫీలో ఆడనున్నారు. అయితే మెడ నొప్పి కారణంగా కోహ్లీ, మోచేతి నొప్పి నుంచి కోలుకుంటున్న కేఎల్ రాహుల్ మాత్రం రంజీ మ్యాచ్‌లకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.