senior actor naresh: పవిత్ర వచ్చాక తన జీవితంలో వచ్చిన మార్పేమిటో ఒక్క మాటలో చెప్పిన నరేశ్

- నాలుగవ భార్యగా నరేశ్ జీవితంలోకి వచ్చిన నటి పవిత్ర
- పవిత్ర తన జీవితంలోకి వచ్చాక .. టైటానిక్ ఒడ్డుకు చేరిందన్న నరేశ్
- తనను అర్ధం చేసుకునే తోడు దొరకడం వరం లాంటిదన్న నరేశ్
కామెడీ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీబిజీగా ఉన్న సీనియర్ నటుడు నరేశ్ జీవితంలోకి నటి పవిత్ర వచ్చిన విషయం తెలిసిందే. మొదటి మూడు వివాహా బంధాలు వివిధ కారణాలతో అర్ధాంతరంగా ముగిసిపోవడంతో పవిత్రను నరేశ్ నాలుగో పెళ్లి చేసుకున్నారు.
తన జీవితంలోకి పవిత్ర వచ్చిన తర్వాత వచ్చిన మార్పులపై నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ మీడియా ప్రతినిధి అడిగి ప్రశ్నకు సమాధానం చెబుతూ.. పవిత్ర తన జీవితంలోకి వచ్చాక .. టైటానిక్ ఒడ్డుకు చేరిందని నరేశ్ అభివర్ణించారు. సినిమా వాళ్లు భిన్నమైన వారిగా పేర్కొన్న నరేశ్.. సినిమానే శ్వాసగా జీవిస్తారని, వారు ఫ్యాషన్ అండ్ ఎమోషనల్ పీపుల్స్ అన్నారు. బ్యాడ్ పీపుల్స్ కాదని అన్నారు.
సినీ జీవితంలో ఉన్న వారు ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం లభించదన్నట్లుగా చెప్పారు. తనను అర్ధం చేసుకునే తోడు దొరకడం వరం లాంటిదని నరేశ్ అన్నారు.