Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్.. మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం

Donald Trump to take oath today as 47th president

  • ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్న డొనాల్డ్ ట్రంప్
  • వాషింగ్టన్‌లో మైనస్ 11 డిగ్రీల ఉష్ణోగ్రత 
  • కేపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో ప్రమాణ స్వీకారం
  • తొలి రోజే వందకుపైగా ఆదేశాలపై ట్రంప్ సంతకాలు

గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (78) నేడు అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు. రాజధానిలో ప్రస్తుతం మైనస్ 11 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకార వేడుకను బహిరంగంగా కాకుండా కేపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో నిర్వహించనున్నారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు అభిమానులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వాషింగ్టన్ చేరుకున్నారు. సెయింట్ జాన్స్ చర్చిలో ప్రార్థనలతో ట్రంప్ తన రోజును ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి వైట్‌హౌస్‌కు చేరుకుని అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి కేపిటల్ హిల్‌కు చేరుకుని ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం తొలి రోజే ట్రంప్ 100కు పైగా ఆదేశాలపై సంతకాలు చేస్తారు.  

Donald Trump
USA
47th President
  • Loading...

More Telugu News