Neeraj Chopra: ఓ ఇంటివాడైన నీరజ్ చోప్రా

- నీరజ్ చోప్రా వెడ్స్ హిమానీ
- కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి
- ఫొటోలు పోస్టు చేసిన నీరజ్ చోప్రా
ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో భారత్ కు తొలి పసిడి అందించిన ఏస్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. హిమానీతో జీవితం పంచుకుంటున్నట్టు నీరజ్ చోప్రా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే, నీరజ్ చోప్రా పెళ్లి ఎక్కడ జరిగిందన్నది, వధువు హిమానీ వివరాలు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు.
కాగా, నూతన దంపతులు నీరజ్-హిమానీలకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. కొందరు మహిళా అభిమానులు మాత్రం హార్ట్ బ్రోకెన్ ఎమోజీలతో విచారం వెలిబుచ్చడం విశేషం.
నీరజ్ చోప్రా ఎవరన్నది 2020కి ముందు ఎవరికీ పెద్దగా తెలియదు. ఆర్మీలో పనిచేస్తున్న చోప్రా... 2020లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో జావెలిన్ క్రీడాంశంలో స్వర్ణం గెలవడంతో ఒక్కసారిగా అతడి పేరు మార్మోగిపోయింది. గతేడాది పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా రజతం గెలిచాడు.


