Hero Motocorp: ఒకేసారి నాలుగు కొత్త బండ్లు తీసుకువచ్చిన హీరో మోటోకార్ప్

Hero introduces 4 two wheelers in Delhi expo

  • ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో
  • కొత్త మోడళ్లను పరిచయం చేసిన హీరో సంస్థ
  • అత్యాధునిక ఫీచర్లతో కొత్త బైకులు, స్కూటర్లు

దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఒకేసారి నాలుగు కొత్త బైకులను పరిచయం చేసింది. ఢిల్లీలో ఏర్పాటు చేసి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో-2025లో ఏక కాలంలో నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. ఇందులో ఎక్స్ ట్రీమ్-250ఆర్, ఎక్స్ పల్స్-210 బైకులతో పాటు, జూమ్ 125, జూమ్ 160 స్కూటర్లను కూడా ఆవిష్కరించింది. 

యువతను దృష్టిలో  ఉంచుకుని ఈ కొత్త ద్విచక్ర వాహనాలను హీరో మోటోకార్ప్ తీసుకువచ్చినట్టు వాటి డిజైన్ చూస్తే అర్థమవుతోంది. స్పోర్టీ లుక్ తో చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. 

ఇందులో హీరో ఎక్స్ ట్రీమ్-250ఆర్ ప్రారంభ ధర రూ.1.80 లక్షలు (ఎక్స్ షోరూమ్) కాగా... జూమ్-125 స్కూటర్ ధర రూ.86,400 (ఎక్స్ షోరూమ్). 

ఈ కొత్త మోడళ్లలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, డీఓహెచ్ సీ మోటార్, టీఎఫ్ టీ డిస్ ప్లే, బ్లూటూత్ సహిత డిజిటల్ స్పీడోమీటర్ కన్సోల్, ఫోన్ చార్జర్, 4 వాల్వ్ టెక్నాలజీ, ఏబీఎస్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ చాంబర్ హెడ్ ల్యాంప్స్, స్మార్ట్ కీ వంటి ఫీచర్లు పొందుపరిచారు.

Hero Motocorp
New Launch
Two Wheelers
Delhi Expo
  • Loading...

More Telugu News