Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ప్రైవేటు విందుకు హాజరైన ముఖేశ్ అంబానీ దంపతులు

Mukesh Ambani and Nita Ambani attends Donald Trump private dinner in Washington

  • జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న ట్రంప్
  • వాషింగ్టన్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు
  • ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన అంబానీ దంపతులు

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు (జనవరి 20) బాధ్యతలు అందుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో, 100 మంది ప్రపంచ ప్రముఖులకు ట్రంప్ వాషింగ్టన్ లో ప్రైవేటు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు భారత్ లో ఒకే ఒక్క వ్యక్తికి ఆహ్వానం అందింది. ఆ వ్యక్తి రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య అధినేత ముఖేశ్ అంబానీ. 

ట్రంప్ ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ కు ముఖేశ్ అంబానీ తన అర్ధాంగి నీతా అంబానీతో కలిసి విచ్చేశారు. ట్రంప్ తో కలిసి విందును ఆస్వాదించారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా మరోసారి వైట్ హౌస్ లో అడుగుపెట్టబోతున్న ట్రంప్ కు అంబానీ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ తో ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ కలిసున్న ఫొటో, వీడియోను రిలయన్స్ ఇండస్ట్రీస్ సోషల్ మీడియాలో పంచుకుంది.

More Telugu News